బాక్సాఫీస్ వద్ద ఆగష్టు నెలలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. తెలుగులో విభిన్న కథల ఎంపికతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఫలితంగా 5 రోజుల్లోనే డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. భారతీయ సంస్కృతి, కృష్ణతత్త్వం అనే అంశాలకు అడ్వెంచర్ ని జోడించి దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. సరికొత్త కథాకథనాలతో రూపొందించిన కార్తికేయ 2.. పాజిటివ్ టాక్ తో రోజురోజుకూ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. హీరో నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఐదు రోజుల్లోనే కార్తికేయ 2 సినిమా రూ. 37.75 కోట్లు గ్రాస్ రాబట్టడం విశేషం. కార్తికేయ 2 మూవీ 5 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే.. AP-TG: 15.32 కోట్ల షేర్(24 కోట్ల గ్రాస్) కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.23 కోట్లు ఓవర్సీస్: 2.75 కోట్లు హిందీ: 2.20 కోట్లు వరల్డ్ వైడ్: 21.50 కోట్లు షేర్ (37.75 కోట్ల గ్రాస్) ‘కార్తికేయ 2’ వరల్డ్ వైడ్ రూ. 12.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక ఐదు రోజుల్లో రూ. 21.50 కోట్లు షేర్ రావడంతో.. ఐదవ రోజు రూ. 8.20 కోట్ల ప్రాఫిట్స్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరబోతోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మరి కార్తికేయ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #Karthikeya2 5 Days Collections..!#KrishnaJanmashtami #KrishnaIsTruth @actor_Nikhil pic.twitter.com/RbnEEiZdWY — TollyTalks (@TollyTalks123) August 18, 2022