Karthika Deepam Priyamani: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్ లో 'కార్తీక దీపం' ఒకటి. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీరియల్స్ అన్నాక లేడీస్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్ బేస్ వేరు. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పోటీపడి ఈ సీరియల్ చూస్తుండటం విశేషం. రోజూ చీకటి పడిందంటే చాలు.. ఎన్ని పనులున్నా వాటిని పక్కనపెట్టి మరి ఈ కార్తీక దీపం సీరియల్ కోసం టైం కేటాయిస్తుంటారు. ఈ సీరియల్ రేటింగ్ కి సినిమాలు, టీవీ షోలకు పోటీగా కొనసాగుతోంది. అదీగాక ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఈ సీరియల్ ని రెగ్యులర్ గా చూస్తుంటారు. అయితే.. ఈ మధ్య కార్తీకదీపం సీరియల్ పూర్తిగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. వంటలక్క, డాక్టర్ బాబులను చంపేసి వారి కూతుర్లు అంటూ కొత్తగా మొదలుపెట్టారు. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత పాపులర్ అయ్యారో.. విలన్ మోనిత కూడా అంతే ఫేమస్. మోనితతో పాటుగా ఆమె పనిమనిషి ప్రియమణి కూడా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. ప్రియమణి సీరియల్ లో పనిమనిషి అన్నమాటే. కానీ.. ప్రియమణి కూడా సోషల్ మీడియాలో గ్లామర్ బ్యూటీ అనిపించుకుంది. పనిమనిషి ప్రియమణి అసలు పేరు శ్రీ దివ్య. సీరియల్ లో పనిమనిషే.. అదే సోషల్ మీడియాలో శ్రీ దివ్య రీల్స్, గ్లామరస్ ఫోటోషూట్స్ చూస్తే ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. ఏంటి.. సీరియల్ లో నటించిన ప్రియమణి క్యారెక్టర్ చేసింది ఈమేనా అనుకుంటారు. అంత అందంగా ఆకట్టుకుంటోంది శ్రీ దివ్య. ప్రస్తుతం శ్రీ దివ్య బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి కార్తీక దీపం పనిమనిషి శ్రీదివ్య ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sridivya Actress (@its_sridivyaas) View this post on Instagram A post shared by Sridivya Actress (@its_sridivyaas) View this post on Instagram A post shared by Sridivya Actress (@its_sridivyaas)