Karan Kundra And Tejaswi Prakash: హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ద్వారా పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్‌ల జంట. బిగ్‌బాస్‌లో ఉన్నపుడు ఎంత హంగామా చేశారో బయటకు వచ్చాక కూడా అదే హంగామా కొనసాగిస్తున్నారు. వీరు తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వెన్నెశా వాలియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వీరు అక్కడ రచ్చ రచ్చ చేశారు. అందరి ముందు హద్దులు దాటి ప్రవర్తించారు. చేతిలో డ్రింక్ పట్టుకుని పబ్లిక్‌గా లిప్‌లాక్ పెట్టుకున్నారు. దీన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అతడు వీడియో తీస్తున్నాడని తెలిసిన వారు కొద్ది ఇబ్బందిపడ్డారు. తేజస్వి అయితే, ‘ప్లీజ్ దాన్ని పోస్టు చేయోద్దు!’ అంటూ బ్రతిమాలింది. అయినప్పటికి ఆ వ్యక్తి దాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, తేజస్వి ప్రకాశ్ నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వరాగిని, పెహ్రెదార్ పియాకి, సిసిలా బడాల్తే రిస్తో వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఇక, కరణ్ కుంద్రా విషయానికి వస్తే అతను ప్యూర్ పంజాబీ అనే పంజాబీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. హర్రర్ స్టోరీ సినిమాలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్ట్ రొమాంటిక్, మేరే యార్ కమీనే, ముభారకన్, 1921 వంటి సినిమాల్లో నటించాడు. మరి, ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జంట అందరిముందు లిప్‌లాక్ పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Nikki G (@nikkigupta092021) ఇవి కూడా చదవండి : సుధీర్ ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ స్టిల్స్ వైరల్! రాఘవేంద్ర రావే స్వయంగా!