Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టారు. తల్లి అయిన తర్వాత కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. మాతృత్వంలోని తియ్యదనాన్ని ఆశ్వాధిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కాజల్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. తాజా, కొడుకుకు సంబంధించిన ఓ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచారు. ఆ ఫొటోలో కాజల్ కూడా ఉన్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప, బాహుబలి కాలిని తన తలపై పెట్టుకున్నట్లు.. కాజల్ అగర్వాల్ తన కుమారుడి కాలును తన తలపై పెట్టుకుని ఫొటో దిగారు. ఆ ఫొటో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మగధీర సినిమాతో బిగ్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత.. వరుస సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగారు. టాలీవుడ్‌తో పాటు సౌత్‌లోని మిగతా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోలందరి సరసన నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 19న కుమారుడు నీల్ కిచ్లూకి జన్మనిచ్చారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. మరి, కట్టప్పగా కాజల్ అగర్వాల్.. బాహుబలిగా కుమారుడు నీల్ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. #KajalAggarwal dedication on #SSRajamouli ❤️#FilmyBowl @SatishKTweets pic.twitter.com/DOKWkpAFdi — Filmy Bowl (@FilmyBowl) August 11, 2022 ఇవి కూడా చదవండి : Hema: సురేఖ వాణిపై నటి హేమ సంచలన ఆరోపణలు.. ఓర్వలేకే అలా చేసిందంటూ!