పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వకీల్ సాబ్ తో అద్బుత విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను తీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో ఉంటారని తెలుస్తుంది. ఈ దీక్షలో ఆయన కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశ్యం ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును కోసమే అంటున్నారు. అంతేకాదు ఆహార నియమాలను అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడనుంది. రాత్రికి శాఖాహార భోజనతో ఆయన దీక్ష ముగిస్తారు. ఆదివారం తొలి ఏకాదశ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన దశావతార వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి అర్చకులు ఆయనకు సాదర ఆహ్వానం పలికారు. ఇక చాతుర్మాస్య దీక్ష ప్రత్యేకత ఏంటంటే.. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లి.. కార్తీక శుద్ద ఏకాదశి నాడు తిరిగి యోగ నిద్ర నుంచి బయటకు వస్తారని ఒక నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజున పీఠాధిపతులు, జీయర్లు వంటి వారు ఈ చాతుర్యాస్మ దీక్షను చేపడతారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.