చిత్ర పరిశ్రమలో నటీ, నటులు తమ లుక్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అందులో భాగంగానే రకరకాల కసరత్తులు చేస్తూంటారు. దాంతో బాడీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో తమ శరీర మార్పులకు ఆపరేషన్ లు సైతం చేయించుకోడానికి వెనకాడరు. ఇండస్ట్రీలో చాలా మంది ముద్దు గుమ్మలు తమ అందాలకు ఆపరేషన్ ల ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. తాజాగా ఇదే కొవలోలోకి ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే.. కృతిశెట్టి.. తన తొలి చిత్రం 'ఉప్పెన'తో కుర్రకారు గుండెల్ని దోచింది ఈ క్యూటీ.. బ్యూటీ. ఆ తర్వాత వరుసగా 'శ్యామ్ సింగ రాయ్' 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో కృతీకి సక్సెస్ ఫుల్ హీరోయినే అనే గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ 'ది వారియర్' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు 'ది వారియర్' ఫ్లాప్‌తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్ అందంగా లేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు సర్జరీకి సైతం సిద్దమైందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. కృతి తన పెదాల పరిమాణాన్ని తగ్గించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్‌ను సంప్రదించి సలహాను కూడా తీసుకుందని వినికిడి. ఇదే నిజమైతే సర్జరీతో అందానికి మెరుగులు అద్దుకున్న హీరోయిన్ల జాబితాలోకి ఈ మంగుళూర్ బ్యూటీ కూడా చెరినట్టే. మరి తన అందాన్ని పెంచుకొవడానికి కృతి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: గుర్తింపు కోసం ఆ రకం పాత్రలు చేశా: నటి జయవాణి ఇదీ చదవండి: RGV: టాలీవుడ్‌లో కష్టాలకి కారణం రాజమౌళినే: వర్మ