KGF మూవీని యష్ కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసి ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదని అన్నారు బీటౌన్ యువ రచయిత రాజ్ సులుజా. ఆయన రచయితగా వ్యవహరించిన మూవీ రాష్ట్ర కవచ్ ఓం. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు ఆడకపోవడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. బాలీవుడ్ చిత్రాలు విజయం సాధించకపోవడానికి కథలు కారణం కాదని, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పు కారణంగానే దక్షిణాది చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారని, ఆ సినిమాలనే ఆదరిస్తున్నారని రాజ్ సులుజా వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: Saipallavi: ఆ క్షణాలన్ని ఎప్పటికీ గుర్తిండిపోతాయి.. సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్! ఏ సినిమాలు చూడడం అనేది వారి ఇష్టమని అన్నారు. ఇక ఉదహరణగా చెబుతూ.. KGF మూవీని యష్ తో కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసి ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదు. అసలు బాలీవుడ్ హీరోలు ఇలాంటి సినిమాల్లో నటిస్తే అంగీకరించేందుకు కూడా ప్రేక్షకులు సిద్దంగా లేరు. ఇదే కాకుండా జాన్ అబ్రహం హీరోగా వచ్చిన సత్యమేవజయతే మూవీ ఫలితం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు అని అన్నారు. ఇక్కడ ప్రేక్షకులు మన హీరోలు ఏం చేసిన ఒప్పుకోరు, అదే ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్ ఇలా అక్కడి హీరోలు ఎలాంటి సినిమాలు తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారని రచయిత రాజ్ సులుజా తన ఆవేదనను వ్యక్తం చేశారు. రచయిత రాజ్ సులుజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.