కరోనా ఎంట్రీ తర్వాత లాక్ డౌన్ కాలంలో ప్రజలంతా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. థియేటర్ లో సినిమా చూసేందు కంటే ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఎంతనేది నిర్ణయిస్తారు. అయితే అన్ని ఓటీటీలు తీసుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అలాగని ఇష్టమైన సినిమాని చూడకుండా ఉండలేరు. అలాంటి వారి కోసం కొన్ని వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఓకప్పుడు తమిళ్ రోకర్జ్ ఆ తర్వాత మూవీ రూల్జ్ వంటి వెబ్ సైట్లు పైరసీ చిత్రాలను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించేవి. అలాంటి కోవకు చెందిందే ఈ ‘ఐబొమ్మ వెబ్ సైట్’ కూడా. ఈ ఐబొమ్మ వెబ్ సైట్ కు తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. నిజానికి ఇలాంటి వెబ్ సైట్స్ లో మూవీ స్ట్రీమింగ్ అనేది నైతికత కాదు. అంతేకాకుండా నిర్మాతలు, ఓటీటీ సంస్థల నుంచిసైతం ఇలాంటి సైట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం చూస్తూనే ఉన్నాం. #ibomma admin note . Shutting Down Ibomma website. Very sad news#Vikram pic.twitter.com/gI4JGcDZap — тяινιкяαм ︻デ═一 (@Trivikram_Pavan) July 6, 2022 ఏ ఓటీటీలో సినిమా విడుదల అయినా కూడా గంటల వ్యవధిలోనే ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతాయి. మూవీ రూల్జ్ సైట్ నుంచి సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలంటే మీకు యూటోరెంట్ యాప్ ఉండాలి. అది కూడా ఎక్కువ డేటా అవసరం ఉంటుంది. కానీ, ఐబొమ్మలో అలా కాదు.. నేరుగా వెబ్ సైట్ నుంచి సినిమా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆన్ లైన్లో చూడచ్చు. Ibomma pic.twitter.com/EABtxMhNkz — Naveen Krishnamraju (@NaveenKRaju22) July 7, 2022 అలా యూజర్ ఫ్రెండ్లీగా పేరు సంపాదించుకున్న ఈ వెబ్ సైట్ ఎంతో మంది నుంచి విశేష ఆదరణ పొందింది. కానీ, ఇప్పుడు సడెన్ గా వెబ్ సైట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తగిన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఐబొమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #IBomma pic.twitter.com/NMxnLMcM3x — icon_AA_DHF (@Reddy_Madhan1) July 6, 2022 ఐబొమ్మ నిర్వాహకులు ఏం చెప్పారంటే.. “క్లౌడ్ సర్వర్లను 99.999% అప్ టైమ్, విడ్త్ తో నిర్వహిచడం ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశం. కానీ, మేము సాధ్యమైనంత వరకు మా సేవలను అందించడానికే ప్రయత్నించాం. కానీ, మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మేము సినిమాలకు మాల్ వేర్ లింకులు పెట్టి డబ్బు సంపాదిస్తున్నాం, మీ వ్యక్తిగత సమాచారం దోచుకుంటున్నామని చెబుతున్నారు.” Ibomma shutting down?? pic.twitter.com/eZhAhpbyXy — ɴ ᴀ ᴠ ᴇ ᴇ ɴ (@Naveen_Tweetz_) July 7, 2022 “నిజానికి ఈ వెబ్ సైట్ ద్వారా మాకు ఎలాంటి ఆదాయం రాదు. కొన్నిసార్లు మేమే ఎదురు డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికీ ఉచితంగా సినిమా కావాలి.. కానీ, ఎవ్వరూ మాకు మద్దతుగా నిలవడం లేదు. మిడిమిడి జ్ఞానం కలిగిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ల మాటలు విని మా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బ్యాకింగ్ సర్వర్ లాగానే మాది కూడా 100 శాతం సురక్షితమైన వెబ్ సైట్.” Ayipayay #ibomma #vikram #prabhas #raviteja #alluarjun #RamCharan #Chiranjeevi #Pawankaly pic.twitter.com/7EoMg3F6Q6 — MASS STROM (@RaviTej40912777) July 7, 2022 “మా జీవితంలో వినోదం, సవాళ్ను ఇష్టపడే సాఫ్ట్ వేర డవలపర్ల సమూహం. మేము ఇలాంటి కామెంట్లను, ప్రచారాలను పట్టించుకోము.. కానీ, వినియోగదారుల నుంచి కాస్త కూడా మద్దతు లభించడం లేదు. అలాంటప్పుడు ఈ వెబ్ సైట్ ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది. అందుకే ఇండియాలో మేము మా సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదా ఈ వెబ్ సైట్ ని ఎవరికైనా అప్పగించడం చేయాలనుకుంటున్నాం” అంటూ ఐబొమ్మ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఐబొమ్మ నిర్వాహకుల ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Ibomma site apestaru antaaa pic.twitter.com/GcrgTQWIA2 — ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ️ (@sandeep9999__) July 7, 2022