Manchu Lakshmi: మంచు లక్ష్మి.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఎప్పుడూ కొత్త దనం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు. దుష్టశక్తులు కలిగిన మాంత్రికురాలిగా విలనిజాన్ని పండించటంలోనూ.. ఓ పల్లెటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని చూపించటంలోనూ మంచు లక్ష్మి తనను తాను నిరూపించుకున్నారు. ఇటు ట్రెడిషినల్గానూ.. అటు మోడ్రన్ గానూ.. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్.. నటనకు స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆమె సినిమాలు చేశారు. అన్ని భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక, సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల మంది ఫాలోవర్సు ఉన్నారు. సినిమాలు.. షూటింగుతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరు. ఏ మాత్రం ఖాళీ దొరికినా అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు కాస్తా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 16 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోలో మంచు లక్ష్మికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఉన్నాయి. అందులో ఆమె వివిధ లుక్స్‌లో వేరియేషన్స్ చూపిస్తూ ఫొటోలు దిగారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఒక్క మనిషిలో ఇన్ని వేరియషన్సా? మంచులక్ష్మికి మాత్రమే సాధ్యం అంటు కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Kamal Haasan: నీటిపై అద్భుతం: కమల్ అభిమానుల క్రేజీ ఆర్ట్!