Karan Johar: ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ స్టార్లు వరుసగా కరోనా బారిన పడ్డారు. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్ వంటి వారు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మే25 న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్‌డే పార్టీ వల్లే.. సెలబ్రిటీలకు కరోనా వచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన ఇచ్చిన పార్టీని ‘కరోనా సూపర్ స్ప్రెడర్’గా పుకార్లు వాపించాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై కరణ్ జోహార్ స్పందించారు.. తన పార్టీ కారణంగా వైరస్ వ్యాపించిందన్న వార్తల్ని కొట్టిపరేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇచ్చిన బర్త్‌డే పార్టీ 'కరోనా సూపర్ స్ప్రెడర్' అంటూ పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వైరస్ ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదు. నేను పార్టీ ఇచ్చిన ఆ వారంలోనే సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్నో పెళ్లిళ్లు, షూటింగులు, ఫంక్షన్లు జరిగాయి. అలాంటప్పుడు నా పార్టీ వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా అంటారు. ప్రతిసారీ నన్నే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఈ మహమ్మారిని నేను సృష్టించలేదు. దాన్ని నేను వ్యాప్తి చేయలేదు... నాకు దానితో ఎలాంటి సంబంధంలేదు. అలాంటప్పుడు నన్నెందుకు నిందిస్తూ వార్తలు రాస్తున్నారు? ఎందుకో అర్థం కావడం లేద’’ని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మే 25న కరణ్ జొహార్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలబ్స్ కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, రష్మిక, విజయ్ దేవరకొండ, నీతూ కపూర్, అనన్య పాండే, రాణీ ముఖర్జీ, తమన్నా, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. తర్వాత సినీ ప్రముఖులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుండంతో చిత్ర పరిశ్రమకు చెందినవారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : RGV: అమితాబ్ బచ్చన్ తో హారర్ సినిమా ప్రకటించిన వర్మ..!