Rana: సాధారణంగా సినిమాలు విడుదలైనా, విడుదలై సక్సెస్ అయినా.. సదరు హీరోహీరోయిన్లకు సోషల్ మీడియాలో విషెష్ అనేవి వేరే సెలబ్రిటీల నుండి వస్తూనే ఉంటాయి. అయితే.. తమ సినిమాను అభిమానులు చూస్తే సంతోషించే నటులు.. ఇండస్ట్రీలోని వేరే సెలబ్రిటీలు ఎలా రెస్పాండ్ అవుతారా? వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఈ విషయంలో హీరో రానాకు చేదు అనుభవం ఎదురైంది. రానా నుండి తాజాగా 'విరాట పర్వం' సినిమా విడుదలైంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించాడు. 1990 దశకంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా నటించారు. ఈ క్రమంలో విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ని ప్రశంసిస్తూ సెలబ్రిటీలంతా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా విరాట పర్వంలో రానా, సాయిపల్లవిల పెర్ఫార్మన్స్ పై నటి మంచు లక్ష్మి స్పందించింది. "సినిమా పోయెట్రీలా ఉంది. స్క్రీన్ పై సాయి పల్లవి మ్యాజిక్ చేసింది. రానా స్క్రిప్ట్ కి లైఫ్ తీసుకొచ్చాడు. డైరెక్టర్ ఎమోషన్స్ ని అందంగా చూపించాడు" అని ట్వీట్ చేసింది. విరాట పర్వంపై మంచు లక్ష్మి రెస్పాండ్ అవ్వడం బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్ ట్యాగ్ లో హీరో 'రానా దగ్గుబాటి' పేరును తప్పుగా రాసింది. అంటే.. రానా దగ్గుబాటి పేరులో 'దగుప్పటి' అని స్పెల్లింగ్ మిస్టేక్ రాసింది. ఇక ఈ విషయాన్ని గమనించిన హీరో రానా.. 'సినిమా గురించి పొగిడావ్ బాగానే ఉంది. కానీ నా పేరు స్పెల్లింగ్ తప్పుగా ఎలా రాసావ్' అని మంచు లక్ష్మిపై సెటైర్ వేస్తూ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం రానా - లక్ష్మిల ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Thank you so much ❤️❤️❤️ but how did you get my tag wrong you can’t spell it wrong https://t.co/c46WigUrWg — Rana Daggubati (@RanaDaggubati) June 17, 2022