యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం "సీతారామం'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సుమంత్ లు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఆగస్టు 5 విడుదలైన ఈ సినిమాకు.. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో సైతం సీతారామం అదరగొడుతోంది. అయితే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందలు తెలియజేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సీతారామంపై ప్రశంసల వర్షం కురిపించారు. 'సీతారామం చూశాను. ఒక చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి.ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది. మనసులుపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నా దత్, ప్రియాంకా దత్ లకు ఒక ప్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్ లుగా ఆప్రేమకథ కి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు , రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభకాంక్షలు. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను" అంటూ మెగాస్టార్ చిరంజీవి ..తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 2న హిందీలో విడుదల కానుంది. సీతారామం మూవీని చిరు ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Kudos Team #SitaRamam @VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022 ఇదీ చదవండి: హాఫ్ శారీలో అనసూయ.. ఫొటోలు వైరల్! ఇదీ చదవండి: ‘ఢీ’ స్టేజిపై వెక్కి వెక్కి ఏడ్చిన నటి పూర్ణ! అసలు ఏం జరిగిందంటే…