తెలుగులో మహేష్ సరసన టక్కరి దొంగ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన బిపాషా బసు.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. 2015లో వచ్చిన ‘ఎలోన్’ సినిమా హీరో కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడిన బిపాషా బసు.. 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా వెల్లడించారు. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను నిర్వహించారు. బెంగాలీ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో.. బెంగాలీ సాంప్రదాయంలోనే సీమంతం వేడుక జరిగింది. తన పుట్టింట్లో బిపాషా తల్లి మమత, భర్త కరణ్ సింగ్ గ్రోవర్ సమక్షంలో ఈ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బిపాషా బసు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో బిపాషా బసు సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ.. స్వచ్ఛమైన భారతీయ స్త్రీని తలపిస్తున్నారు. త్వరలోనే పండంటి బిడ్డకి జన్మనివ్వనున్న బిపాషా బసుకి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. వెస్టర్న్ కల్చర్ మోజులో పడి భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బిపాషా బసు ఇలా భారతీయ సాంప్రదాయం ప్రకారం సీమంతం వేడుకను జరుపుకున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) ఇది కూడా చదవండి: Childhood Pic: ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్? ఇది కూడా చదవండి: Prabhas: పెదనాన్నని చూస్తూ ప్రభాస్ కన్నీరు! ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్!