ఇండస్ట్రీకి చెందిన అభిమాన సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. పెళ్లి తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారని తెలియడం మరో గుడ్ న్యూస్. అదే తమ అభిమాన సెలెబ్రిటీ కొడుకు/కూతురి ముఖాన్ని మొదటిసారి రివీల్ చేశారని, ఆ బేబీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిందని తెలిస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అది సినీ హీరోహీరోయిన్స్ అయినా.. టీవీ, బిగ్ బాస్ సెలబ్రిటీస్ అయినా ఫ్యాన్స్ కి ఒక్కటే. ప్రస్తుతం ఫ్యాన్స్ లో అంతటి ఆనందం కలిగించిన సెలెబ్రిటీ ఎవరు? అనంటే.. నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి దంపతులు. బిగ్ బాస్ రియాలిటీలో కంటెస్టెంట్ గా పాపులర్ అయిన సామ్రాట్.. తెలుగు ప్రేక్షకులకు సినీ నటుడిగా సుపరిచితమే. తెలుగులో యువకుడు, పంచాక్షరి, వైఫ్ ఆఫ్ రామ్, అహనా పెళ్ళంట, కొంచం ఇష్టం కొంచం కష్టం లాంటి సినిమాలు చేశాడు. కానీ.. నటుడిగా సూపర్ క్రేజ్ అందుకోలేకపోయాడు. అయితే.. ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షో సెకండ్ సీజన్ లో పాల్గొన్నాడో.. అప్పటి నుండి జనాలకు సామ్రాట్ ఎవరో తెలియడం మొదలైంది. ఇక బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సామ్రాట్.. తన లైఫ్ స్టోరీ, కెరీర్ స్ట్రగుల్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోనే షేర్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక 2021లో కాకినాడకు చెందిన అంజనా శ్రీ లిఖితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగష్టులో సామ్రాట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఈ ఇద్దరు దంపతులు తమ కూతురి ఫోటోలు షేర్ చేయకుండా ఫేస్ దాచిపెడుతూ ఫ్యాన్స్ ఇన్నిరోజులు ఊరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సామ్రాట్, అంజనాలకు ఫ్యాన్స్ నుండి కూతురి ఫేస్ చూపించాలని రిక్వెస్టులు చాలా వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు చేశారో.. లేదా ఎలాగో చేసేద్దాం అనుకున్నారో సామ్రాట్ దంపతులు మొదటిసారి తమ కూతురి ముఖాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ప్రస్తుతం సామ్రాట్, అంజనా తమ కూతురితో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు తెగవైరల్ అవుతున్నాయి. అదీగాక సామ్రాట్ కూతురి ఫేస్ చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సామ్రాట్ కి గతంలో హర్షిత రెడ్డి అనే అమ్మాయితో పెళ్లైంది. వారిద్దరూ పరస్పర ఒప్పందంతో 2018లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని సామ్రాట్.. తన భార్య, బిడ్డతో హ్యాపీగా ఉంటున్నాడు. మరి సామ్రాట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by samkilikhi♾️ (@samratlikhitha) View this post on Instagram A post shared by samkilikhi♾️ (@samratlikhitha) View this post on Instagram A post shared by Samrat Reddy (@samratreddy) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) View this post on Instagram A post shared by Likhita (@anjanaasriilikhitaa)