సుమ అనగానే.. గలగల మాట్లాడే యాంకర్ గుర్తొస్తుంది. తెలుగింటి కోడలు అయిన ఈమె.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాల్ని కూడా బయటపెడుతూ ఉంటుంది. ఇప్పుడు అలా తన పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియని, చెప్పని ఓ విషయాన్ని రివీల్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు షోల్లోయాంకర్ అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు సుమ కనకాల. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని ఎప్పుడూ బిజీగా బిజీగా ఉండే ఈమె.. యూట్యూబ్ లోనూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. నెటిజన్స్ కి తన గురించి తెలీని విషయాల్ని చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తన పెళ్లిలో తాను కట్టుకున్న చీర ధర గురించి చెప్పి సుమ షాకిచ్చింది. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పట్టుచీరల షాపింగ్ కోసం ఓ మాల్ కి వెళ్లిన సుమ.. రూ.15 వేల లోపు పట్టుచీరలు కావాలని సేల్స్ మేన్ ని అడిగింది. మీ రేంజ్ ఇది కాదని.. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లమని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లి అడగ్గా.. ఓ చీర ఖరీదు రూ.2 లక్షల పైనే అని సేల్స్ మేన్ చెప్పాడు. ఈ రేట్స్ చూసి షాకైన సుమ.. 'ఇది చీరల షాపా.. బంగారం షాపా.. నా పెళ్లికి కూడా ఇంత కాస్ట్ లీ చీర కట్టలేదు' అని చెప్పింది. తన పెళ్లిచీర ఖరీదు కేవలం రూ.11 వేలు మాత్రమేనని చెప్పింది. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా చాలా సినిమాలు చేశారు, చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుమ-రాజీవ్ మధ్య గొడవలు అయ్యాయని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ.. 'భార్య భర్తలు అన్నాక ఏదో ఒకటి అనుకోవడం, గొడవ పడటం మాములు విషయమేనని' సుమ కొట్టిపారేసింది. మరి సుమ పెళ్లి చీర కాస్ట్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇది కూడా చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. సరైన అవగాహన లేకే ఇలా అయ్యింది!