Amala Paul: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. తెలుగులో నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. అమలాపాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల అభిమానం బాగానే సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో ఫామ్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని పెళ్ళాడి సర్ప్రైజ్ చేసింది. సరే ఎలాగో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది కదా అనుకున్న మూడేళ్లకే డైరెక్టర్ తో మనస్పర్థలు ఏర్పడి విడాకులు ప్రకటించింది. పెళ్ళైన మూడేళ్లకే విడాకులు తీసుకునే సరికి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా షాక్ కి గురైంది. ఆ తర్వాత మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన అమల.. సింగిల్‌గా ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన అమలకు మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురైంది. ఫ్యాన్స్ అడిగేసరికి అమల తన రెండో పెళ్లి గురించి నోరువిప్పింది. 'మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. 'ఇప్పుడైతే మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, కెరీర్ పై ఫోకస్ పెడుతున్నాను. కాబట్టి.. చేసుకోబోయేవాడి అర్హతలు ఇప్పుడే చెప్పలేను. నన్ను చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో త్వరలో చెబుతా' అని జవాబిచ్చింది అమలాపాల్. ఈ నేపథ్యంలో అమలా రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. అభిమానులు సైతం నిజమేనని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమల కెరీర్ విషయానికొస్తే.. మలయాళంలో రెండు, తమిళంలో ఓ సినిమా చేస్తోంది. పూర్తిగా సినిమాలే కాకుండా అడపాదడపా వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది ఈ కేరళ బ్యూటీ. మరి అమలాపాల్ రెండో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Tollywood beauty Amala Paul pic.twitter.com/FGabqjznJQ — Subhash Shirdhonkar (@4331Subhash) July 6, 2022