"ఛలో" సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తరువాత 'గీత గోవిందం' సినిమాతో మంచి గుర్తింపు సంపాందించింది. 'పుష్ప' సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్ గా మారింది ఈ కన్నడ భామ. ఇటీవల విడుదలైన 'సీతారామం' సినిమాలో కూడా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు. పొట్టి డ్రెస్లు వేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది ఈ భామ. అప్పుడప్పుడు రష్మికపై ట్రోలింగ్లు కూడా జరుతుంటాయి. అయితే తాజాగా మరోసారి రష్మిక చేసిన ఓ కామెంట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఓ యాడ్ కోసం అల్లు అర్జున్.. తన గెటప్ మొత్తంగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ కోసం బన్నీ నెరిసిన జుట్టు, గడ్డం, నోట్లో సిగార్ తో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఆ లుక్ కి ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ గా ప్రశంసలు దక్కాయి. ఈ న్యూ లుక్ సోషల్ మీడియాను తెగ వైరల్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఫోటో ట్యాగ్ చేస్తూ.. 'మై గాడ్, ఒక్క క్షణం మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను సార్' అని ట్వీట్ చేసింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ రష్మికపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో రష్మిక ఓవర్ యాక్షన్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనకు నేషనల్ క్రష్ స్టేటస్ తెప్పించిన బన్నీని కూడా రష్మిక గుర్తు పట్టలేదా? అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రష్మికకు ప్రస్తుతం హిందీ హీరోలు మాత్రమే గుర్తుంటారని తెలుగు హీరోలు గుర్తుండరని కామెంట్లు చేస్తున్నారు. రష్మిక సరదాగా అలా కామెంట్ చేసి.. బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. మరి.. రష్మిక ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. pic.twitter.com/wm1GuLLmsA — Allu Arjun (@alluarjun) July 29, 2022 ఇదీ చదవండి: ఘనంగా సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్.. ఇదీ చదవండి: కట్టప్పగా కాజల్ అగర్వాల్.. బాహుబలిగా కుమారుడు నీల్!