అలియా భట్- రణబీర్ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ రెండు పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వాళ్లిద్దరూ పేరెంట్స్ కాబోతున్నారు. రెండు వాళ్లిద్దరూ కలిసి లీడ్ రోల్లో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. మొత్తం 3 భాగాల్లో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా బృందం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా విడుదలకు సరిగ్గా వంద రోజుల ముందే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబందం సౌత్ స్టేట్స్ లోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. టాలీవుడ్లో అయితే రాజమౌళితో కలిసి రణబీర్ కపూర్ ఫుల్ ప్రమోషన్స్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నార్త్ లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. Actress #AliaBhatt (@aliaa08) and #RanbirKapoor papped at #Brahmastra promotions in Mumbai. pic.twitter.com/UpsbysWzV2 — SumanTV (@SumanTvOfficial) August 26, 2022 అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో అలియా భట్ సైతం పాల్గొంటోంది. ఆ విషయం పక్కన పెడితే.. అలియా భట్ బేబీ బంప్‌తో ఫొటోలకు ఫోజివ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వాళ్లిద్దరూ పేరెంట్స్ కాబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ బేబీ బంప్ కనిపించేలా ఫొటోలు విడుదల చేయలేదు. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) కానీ, ఇప్పుడు మొదటిసారి బేబీ బంప్‌తో అలియా భట్ ఫోజులు ఇవ్వగానే అవి కాస్తా వైరల్ గా మారాయి. పిక్ కలర్ ట్రాన్స్పరెంట్ టాప్ తో బేబీ బంప్‌తో స్మైల్ ఇస్తూ అలియా భట్ కనిపించింది. పక్కనే రణబీర్ కపూర్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ప్రౌడ్ పేరెంట్స్ కాబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలియా భట్- రణబీర్ కపూర్ వైరల్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by SumanTV (@sumantvinsta) ఇదీ చదవండి: ‘లైగర్’ సినిమాకోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే.. ఇదీ చదవండి: అనసూయపై విజయ్ ఫ్యాన్స్ బూతులు? అనసూయ నీకు డబ్బులు ఇస్తే అంటూ..!