అక్షయ్ కుమార్.. ఈ బాలీవుడ్ స్టార్ హీరో సంవత్సరానికి నాలుగు సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. అంతేకాకుండా ఇటీవల దేశంలోనే అత్యధిక ఆదాయపన్ను హీరోగా అక్షయ్ కుమార్ అవార్డు కూడా అందుకున్నాడు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన రక్షా బంధన్ ఈ ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ సూపర్ సింగర్ 2 కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాఖీ స్పెషల్ ఎపిసోడ్ కావడంతో రక్షా బంధన్ సినిమాని ప్రమోట్ చేసేందుకు వెళ్లాడు. ఆ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ సోదరి అల్కా భాటియా రాఖీ కట్టే ఫొటోలను వీడియోగా చేసి చూపించారు. ఆ వీడియో చూస్తూ అక్షయ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. అందరి ముందే ఏడ్చేశాడు. Pune, it’s always a pleasure coming here. Thank you Sri Balaji University for giving Team #RakshaBandhan the warmest welcome Mazaa aa gaya! pic.twitter.com/OVodIRBDGc — Akshay Kumar (@akshaykumar) August 3, 2022 వీడియోలో తన అల్కా భాటియా మాటలు ఉన్నాయి. అన్నగా, ఫ్రెండ్, తండ్రిగా నువ్వు ఎన్నో బాధ్యతలు పోషించావు. నువ్వు నాకోసం ఎంతో చేశావు అంటూ మాటలు వినగానే అక్షయ్ ఏడ్చేశాడు. తన సోదరి గురించి మాట్లాడుతూ.. “మేము అప్పటి వరకు ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. ఆ దేవత వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయాయి. అన్నా చెల్లెళ్ల బంధం కన్నా మరే బంధం గొప్పది కాదు” అంటూ అక్షయ్ కుమార్ అందరి ముందూ ఏడ్చేశాడు. ఈ వైరల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: బింబిసార సక్సెస్ పై Jr. NTR ట్వీట్! కళ్యాణ్ రామ్ అన్న కుమ్మేశావు ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన సమీరా రెడ్డి!