యాంకర్ అనసూయ.. తన అందంతో పాటు మెస్మరైజ్ చేసే యాంకరింగ్ తో అనతి కాలంలోనే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాటుదేలింది. మొదట్లో ఓ టీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు యాంకర్ గానే కాకుండా అటు నటిగా కూడా రోజుకొక మెట్టు ఎక్కుతోంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో తన అందంతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకునే పనిలో రంగమ్మత్త ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. అయితే జబర్ధస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ బుల్లితెరపై వచ్చిన ఈ షోతో అనసూయ మరింత పాపులర్ అయింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ అనసూయకు సినిమాల్లో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. వచ్చిన అవకాశాలు వడిసి పట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రంగస్థలం, పుష్ఫ వంటి టాప్ సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషించి మరింత గుర్తింపును సంపాదించుకుంది. ఇలా తక్కువ కాలంలోనే నటిగా దూసుకుపోతున్న అనసూయపై తాజాగా జబర్ధస్త్ కమెడియన్ అదిరే అభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనసూయపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది కూడా చదవండి: Paruchuri Gopala Krishna: ‘ఆచార్య’లో కొరటాల శివ చేసిన తప్పులు ఎత్తిచూపిన పరుచూరి గోపాలకృష్ణ! అనసూయను అను అని ప్రస్తావిస్తూ.. అను నేను నిన్ను నీ కెరీర్ ప్రారంభం నుంచి చూస్తున్నా.. ఓ న్యూస్ రీడర్ గా పని చేశావు, యాంకర్ గా రాణించావు, ఇప్పుడేమో నటిగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లోనే నటిస్తున్నావు. నీ ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నదే అని అదిరే అభి అనసూయను ప్రశంసించారు. అభి వ్యాఖ్యలు విన్న అనసూయ పట్టలేని సంతోషంతో ఉబ్బితుబ్బిపోయింది. ఇంతటితో ఆగకుండా అభికి థాంక్స్ చెబుతూ అతను మాట్లాడిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అభి అనసూయపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి. అనసూయపై అదిరే అభి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.