రానా, సాయిపల్లవి జంట వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం 'విరాట పర్వం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో సాయిపల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు పలు ప్రమోషన్స్‌లలో సాయి పల్లవి పాల్గొన్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు ఊడుగుల విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. స్టూడెంట్స్ డ్యాన్స్ చేయమని అడగ్గా వారి కోరిక మేరకు "ఫిదా" మూవీలోని 'వచ్చిందే' అనే పాటకు డ్యాన్స్ చేసింది. పల్లవి డ్యాన్స్ చేస్తుంటే స్టూడెంట్ ఈలలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారుప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3 — Shreyas Media (@shreyasgroup) June 16, 2022