గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులేకాదు.. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. ఒడియా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టీవీ నటి రాజేశ్వరి రే మహాపాత్ర కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. గతంలో తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానని ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ఒడియా బుల్లితెర పై రాజేశ్వరి కి ఎంతో మంచి పేరు ఉంది. ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు టీవీ, సినీ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది చదవండి: Rashmi Gautam: తన బయోగ్రఫీ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న రష్మీ!