సీనియర్ నటుడు నరేష్ పేరు ప్రస్తుతం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు కర్ణాటకలో కూడా మారుమోగి పోతుంది. పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్, మూడో భార్య రమ్యతో వివాదాల కారణంగా ఆయన మీద బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. ఇక నరేష్‌కి, రమ్య మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడుస్తోంది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి వివాదానికి ఇప్పట్లో ముగింపు లభించేలా లేదు. ఈ క్రమంలో నరేష్ కి మద్దతుగా ఒకప్పటి నటి పూజిత మాట్లాడారు. నరేష్ ఉమెనైజర్ అంటూ రమ్య చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పూజిత. నటుడు నరేష్ ఇష్యు తెగ వైరల్ అవుతున్నా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒకరు కూడా స్పందించలేదు. పరిశ్రమలో నరేష్ కు మంచి పేరు ఉన్నప్పటికి..ఎవరూ మీడియా ముందుకొచ్చి ఆయన మద్దతు ఇవ్వలేదని చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సినీయర్ నటి పూజిత.. నరేష్ కి మద్దతుగా మాట్లాడారు. నటి పూజిత మాట్లాడుతూ..." నరేష్ ఉమెనైజర్ అంటూ రమ్య రఘుపతి అంటున్నారు. గతంలో నేను చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించాను. నరేష్ తో కూడా కొన్ని సినిమాలో నటించాను. నేను బాగానే ఉన్నాను కదా.. నా ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయి కదా..ఆయన నిజంగా ఉమనైజర్ అయితే.. నన్ను కూడా అడగాలి కదా. కానీ ఆయన అలా అడగలేదు. నేను అనారోగ్యంతో హాస్పిటల్ ఉంటే ఆదుకున్నారు. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన వల్లే. ఆరోజు ఆయన కనుక నాకు సాయం చేయకపోతే.. నేను ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు. నాలాగే చాలా మంది ఆయన వల్ల సాయం పొందారు. అలాంటి వ్యక్తి.. వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టారు కాబట్టి నా అంతట నేనే కర్ణాటక వెళ్లి.. మీడియాతో మాట్లాడాను. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ రచ్చ చేశారు. ఇక కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు? నేను షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నా.. నా బ్రదర్‌కి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని అనుకున్నాను. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏమిలేదు. కేవలం మానవత్వంతో స్పందిస్తున్నా. నా లాంటి వాళ్ళు బతికి ఉండాలంటే మా బ్రదర్ బతికే ఉండాలి. నరేష్ గారు నిజంగా ఉమెనైజర్ అయితే.. ఇండస్ట్రీలో 36 ఏళ్లు గా ఉన్నారు.. ఒక్క అమ్మాయి అయినా ఫిర్యాదు చేసిందా? ఆయన వయసు ఇప్పుడు యాభై పైనే.. ఎవరైనా ఆయన అలాంటి వాడు అని చెప్పారా?"అని నటి పూజిత..నరేష్ కి మద్దతు మాట్లాడింది. మరి.. సినీయర్ నటి పూజిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: గంగోత్రిలో అల్లు అర్జున్ తో నటించిన పాప.. ఇప్పుడు ఇలా ఉందా!