సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు హీరో హీరోయిన్లు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి అభిమానులు ఎంతో మురిసిపోతుంటారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిన్నతనంలో అమ్మకు చాక్లెటు తినిపిస్తూ.. ఎంతో క్యూట్ ఉంది. ఇప్పుడు తన అందాలతో కుర్రకారు మతిపొగొట్టేస్తుంది. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు అనే కదా మీ సందేహం.. ఆమె బుట్టబొమ్మ పూజ హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కి పూజ హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుణ్ తేజకు జోడిగా 'ముకుంద' సినిమాలో నటించి.. అందరిని మెప్పించింది. ఇలా టాలీవుడ్ లో మొదలైన తన కెరీర్ ఇప్పుడు ఫుల్ బిజీగా సాగుతోంది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలందరితోను నటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాదం', 'అలా వైకుంఠపురం', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటించి.. ఫుల్ క్రేజ్ సంపాందించింది. యంగ్ హీరో అక్కినేని అఖిల్ సరసన బ్యాచిలర్ చిత్రంలో నటించి.. మరో హిట్ సినిమాను తనఖాతాలో వేసుకుంది. ఇలా టాలీవుడ్ హీరోలకు మంచి ఆఫ్షన్ గా మారింది.ఇక పూజా హెగ్డే దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిచింది. తమిళ హీరో విజయ్ కు జోడిగా బీస్ట్ చిత్రంలో నటించింది. 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ సరసన నటిచింది. 'రాధేశ్యామ్' మూవీలో ప్రభాస్ తో జోడి కట్టింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలను ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది. ఇటీవలే మాల్దీవ్స్, పారీస్ లో దిగిన హాట్ ఫిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కుర్రకారు మతిపొగొట్టేస్తుంది. ఇలా అందరిని ఆకట్టుకుంటున్న పూజ.. చిన్నతనంలో ఎంతో క్యూట్ గా ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) ఇదీ చదవండి: స్టేజ్‌పై రౌడీ రోహిణీని పొగడ్తలతో ముంచెత్తిన మహేశ్ బాబు! ఇదీ చదవండి: అభిమానులను నిండా ముంచిన యూట్యూబ్ స్టార్! రూ.437 కోట్ల మోసం..