నటి ఇంద్రజ.. 1993లో తమిళ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కెరీర్‌లో ఒకసారి పెళ్లి, మరోసారి తల్లి మరణంతో గ్యాప్ తీసుకున్న ఆవిడ.. ప్రస్తుతం అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తల్లి మరణం తర్వాత తప్పక ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం భర్త ఇస్తున్న సపోర్ట్ తోనే తిరిగి షోస్, మూవీస్ చేయగలుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమాలు కంటే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతోనే ఇంద్రజ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు. జబర్దస్త్ వంటి కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా.. ఆ షోపై వచ్చే రూమర్స్, నెగిటివ్ కామెంట్స్, జబర్దస్త్ కు టీఆర్పీ తగ్గిపోయిందా? అడల్ట్ కంటెట్, బాడీ షేమింగ్ ఎక్కువైంది అని వస్తున్న కామెంట్స్ కు సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చారు. ఇన్నేళ్లుగా అసలు ఆ షో ఎలా సక్సెస్ కాగలుగుతోంది. ఆ షోలో బాడీషేమింగ్ పంచులు ఎందుకు ఉండాల్సి వస్తోందో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి.. ఆ వైరల్ ఇంటర్వ్యూని ఈ క్రింది వీడియోలో చూడండి. ఇంద్రజ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.