ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి హ్యాపీ భావ్‌సర్ నాయక్ కన్నుమూసిన ఘటనతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు మౌలిక్ నాయక్ భార్య అయినటువంటి హ్యాపీ నాయక్.. మోంటు నీ బిట్టు, 'ప్రేమ్‌జీ: రైజ్ ఆఫ్ ఏ వారియర్' సినిమాలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హ్యాపీ.. గురువారం(ఆగష్టు 25న) లంగ్ క్యాన్సర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. వివరాల్లోకి వెళ్తే.. హ్యాపీ భావ్‌సర్ గురువారం అహ్మదాబాద్‌లో మరణించారు. ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. భావ్‌సర్ గుజరాతీ నటుడు మౌలిక్ నాయక్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆర్టిస్ట్ ల ఫ్యామిలీలో జన్మించిన హ్యాపీ.. గునేగర్, టంఖా సీరియల్స్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. అలా కాలేజీలో కూడా పలు ప్రదర్శనలు చేసి సినిమాలలో అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక హ్యాపీ మరణంతో గుజరాతీ ఇండస్ట్రీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె స్నేహితులు, సహనటులు వారి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నివాళులర్పించారు. ఈ ఏడాది ప్రారంభం నుండి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో హ్యాపీ బాధపడుతున్నారు. నివేదికల ప్రకారం, ఆగస్టు 24 ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఇక వెంటిలేటర్ పై పెట్టిన 24 గంటల్లోనే ఆమె మరణించడం విషాదకరం. I’m heartbroken look at her face.. હજી તો 2 june એના ઘરે 2 દીકરીઓ અવતરી.. રોજ સવારે Facebook પર કોઈને Happy Birthday wish કરીયે એટલે Happy Bhavsar Nayak નું નામ automatically reflect થઈ જ જાય એટલે બધાની સવાર એને યાદ કરીને જ પડે..તારા આત્માની શાંતિ માટે jay shree krishna pic.twitter.com/BzTmF5HcR1 — Niilam Paanchal (@niilampaanchal) August 25, 2022 Happy bhavsar - one of the most talented Actor of Gujarati Theater and Films passed away at the midnight due to lung cancer. Happy, you made every one happier around you always! May your soul rest in peace! pic.twitter.com/RpkWUZRwPP — Ravi Desai (@iRaviDesai) August 25, 2022