సాధారణంగా ఒక మతంలో పుట్టినవారు ఒక వయసు లేదా అవగాహన వచ్చాక తమకు ఇష్టమైన మతంలోకి మారుతూ ఉంటారు. ఇలా ఇష్టమైన మతాన్ని స్వీకరించడం అనేది మామూలు జనాల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీలలో కూడా జరుగుతుంటుంది. మొదటగా ఒక మతంలో పుట్టిన స్టార్స్.. పెద్దయ్యాక లేదా పెళ్లయ్యాక భర్త/భార్య మతాలను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంటారు. ఆ విధంగా ఒక మతం నుండి మరో మతానికి మారిన సౌత్ ఇండియన్(కొందరు బాలీవుడ్) సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు. మరి మతం మార్చుకున్న ఆ స్టార్స్ ఎవరో చూద్దాం! జయసుధ: హిందూ కుటుంబంలో పుట్టిన జయసుధ.. 2001లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. నగ్మ: ముస్లిం మదర్, హిందూ ఫాదర్ కి జన్మించిన నగ్మ.. క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. నయనతార: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నయన్.. కొన్నేళ్ల కిందట హిందూ మతాన్ని స్వీకరించారు. ఖుష్బూ: ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన ఖుష్బూ.. పెళ్లి తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు. AR రెహమాన్: చిన్నప్పుడే హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు. ఈయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. మోనిక: హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు. ఆమె పేరును ఎంజి రహీమాగా మార్చుకున్నారు. జ్యోతిక: పంజాబీ అయిన జ్యోతిక.. సూర్యతో పెళ్లి తర్వాత హిందూ మతంలో అడుగు పెట్టింది. సంజనా గల్రాని: 2018లో ఇస్లాం మతాన్ని స్వీకరించి మహీరాగా పేరు మార్చుకుంది. అయేషా టాకియా: ఈమె గుజరాతి ఫాదర్, కాశ్మీరీ మదర్.. పెళ్లయ్యాక ఇస్లాంని స్వీకరించారు. యువన్ శంకర్ రాజా: మ్యూజిక్ డైరెక్టర్ అయిన యువన్.. తల్లి మరణంతో హిందూ నుండి ఇస్లాంలోకి మారారు. లిజి: క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించిన లిజి.. పెళ్లి తర్వాత హిందూ మతంలోకి మారారు. మమత కులకర్ణి: హిందూ నుండి ఇస్లాంలోకి మారారు. హేమా మాలిని: భర్తతో కలిసి హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు. ఇలా మతం మార్చుకున్న సినీతారలు ఎక్కువగా బాలీవుడ్ లో ఉన్నారు. దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పుడో ఒకరు మతాన్ని మార్చుకుంటూ వచ్చారు. మరి ఇప్పటివరకూ మతాన్ని మార్చుకున్న పాపులర్ స్టార్స్ లో పైన తెలిపిన వారున్నారు. వీరితో పాటు ఇంకా ఎంతోమంది ఈ జాబితాలో ఉన్నారు. మరి మతం మార్చుకున్న ఈ సినిమా స్టార్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.