తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ప్రముఖ గాయకులు రామకృష్ణ తనయుడు సాయి కిరణ్ ‘నువ్వే కావాలి’నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’అనే పాటతో బాగా పాపులర్ అయ్యాడు సాయి కిరణ్. ఆ తర్వాత పటు చిత్రాల్లో నటించినా పెద్దా పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సిరియల్స్ లో నటిస్తున్నాడు. నటుడు సాయి కిరణ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళితే.. తనకు మన్న మినిస్ట్రీస్‌లో సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి ప్రొడ్యూసర్లు జాన్ బాబు, లివింగ్ స్టెన్ అనేవారు తన వద్ద పది లక్షలకు పైగా డబ్బులు వసూళ్లు చేశారని.. సభ్యత్వం ఇప్పించకపోగా డబ్బు అడిగినప్పుడు ఏదో ఒక కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తననే బెదిరిస్తున్నారని.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక సాయి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420, 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిచారు. ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు రామకృష్ణ కొడుకుగా.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వే కావాలి’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు సాయి కిరణ్. ఆ తర్వాత సాయికిరణ్ పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో హీరో రిషి తండ్రిగా మహేంద్ర భూషన్ పాత్రలో అదరగొడుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Young man: ఆ యువకుడు షర్ట్ విప్పితే ఖంగుతిన్న పోలీసులు! ఎందుకంటే..