నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు.. ముఖ్య వివరాలు: ఖాళీలు: 1540 విభాగాలు: ఏఈఈ(సివిల్): పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్(మిషన్ భగీరథ) - 302 ఏఈఈ(సివిల్): పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ - 211 ఏఈఈ (సివిల్): ఎంఏ & యూడీ- పీహెచ్ - 147 ఏఈఈ(సివిల్): టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్ - 15 ఏఈఈ ఐ & సీఏడీ డిపార్ట్‌మెంట్ - 704 ఏఈఈ (మెకానికల్): ఐ & సీఏడీ(జీడబ్ల్యూడీ) - 03 ఏఈఈ (సివిల్): టీఆర్ & బి - 145 ఏఈఈ (ఎలక్ట్రికల్): టీఆర్ & బి - 13 అర్హతలు: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. జీతభత్యాలు: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు జీతం పొందుతారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 22, 2022 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 14, 2022 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న టీఎస్‌పీఎస్సీ కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంచుతామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: డీఆర్‌డీఓలో 1901 ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అందరూ అర్హులే.! ఇదీ చదవండి: డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ‘విప్రో’.. చదువుకుంటూనే ఉద్యోగం చేసే అవకాశం.. పూర్తి వివరాలివే!