ఏ ఉద్యోగము దొరక్క ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం వచ్చింది. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న హైదరాబాద్ మహానగర పరిధిలోని శంషాబాద్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 80కి పైగా కంపెనీల్లో 7000లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంటెక్, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి మరియు మూగ, శారీరక వికలాంగులకు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో స్పష్టం చేశారు. కావున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. వేదిక: శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ సెంటర్. ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలక కోసం +919030047304 హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించండి. Conducting Job Mela by Shamshabad Municipality, over a 200+ Companies is being involved in this mela,@KTRTRS @cdmatelangana @VSrinivasGoud @KolanSushma @PrakashGoudTRS @DrRanjithReddy @CollectorRRD @Prateek_JainIAS pic.twitter.com/qwygDGVqHx — MC Shamshabad (@mcshamshabad) August 23, 2022 ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..? ఇదీ చదవండి: Govt Jobs: 2446 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. పూర్తి వివరాలివే!