భారత దేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. భక్తులు కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ క్షేత్రాలను సందర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. అలాంటి దర్శనీయ స్థలాల్లో ఒకటి వీరభద్రస్వామి భద్రకాలి అమ్మవారి ఆలయం.ఈ ఆలయం ఎర్రగొండ పాలెం మండలం నల్లమల అడవిలో పాలంక క్షేత్రం కొండ చరియల కింద ఉన్నది. ఇక్కడ కొలువైన ఉన్న వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను ప్రతి సంవత్సరం ఆశ్వీయుజమాసం, తొలి ఏకాదశ రొజున భక్తులు దర్శించుకుంటారు. వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రతిఏటా వేల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్ర ప్రత్యేకత ఏంటంటే వివాహం జరిగిన చాలా ఏళ్లు అవుతున్నా సంతానం కలగని వారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అమ్మవారి గుడి పై భాగం ఉన్న కొండచరియ నుంచి నీటి చుక్కలు కింద పడుతుంటాయి.. ఆ నీటి చుక్కలు సంతానం లేని వారి అరచేతిలో పడితే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు విశ్వాసం. అందుకే ఇక్కడ పిల్లలకు ఎక్కువగా అమ్మవారు, స్వామి వారి పేరు వచ్చేలా పెడుతుంటారు. ఉత్సవంవేళ వారి సంతానానికి పుట్టు వెంట్రుకలు తీయించడం భక్తులకు అనవాయితీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు విచ్చేస్తుంటారు. తొలిఏకాదశి ముందు రోజే భక్తులు పాలంక క్షేత్రానికి చేరుకుంటారు. తొలి ఏకాదశి రోజున కొంతమంది భక్తులు చేరుకుంటారు. కొండపై నుంచి 2000 అడుగులు కొండ కిందకు దిగి భక్తులకు కొండచరియక్రింద ఉన్న పాలంక వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారర్ల సన్నిధికి చేరుకుంటారు. ఈ ఏడాది ఏకాదశే ముందు రావడంతో భక్తుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.