రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇప్పటికే నిమర్జనాలు ప్రారంభం కూడా అయ్యాయి. అయితే రెండు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్న వినాయకుడు బాలాపూర్ గణేశుడు. నగర శివారులో ఉన్న బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం పాటకు పెట్టింది పేరు. ప్రతీ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో వేలానికి దక్కించుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వేలం పాట పోటా పోటిగా సాగింది. గత సంత్సరం కంటే రికార్డు స్థాయిలో ఈ సారి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గణేశుడు అంటేనే లడ్డూ వేలం పాటకు పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ప్రతీ సంవత్సరం రికార్డు స్థాయిలో ఈ లడ్డూను దక్కించుకుంటూ ఉంటారు. ఈ వేలం పాటకు స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరో సారి బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధరకు దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు అయిన వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను రూ. 24.60 లక్షలకు దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన ఈ వేలం పాటలో ఆయన ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ లడ్డూ కోసం 6గురు స్థానికులు, మరో ముగ్గురు ఇతర ప్రాంతాల వారు పోటీ పడ్డారు. గతేడాది ఈ లడ్డూను రూ.18.90 లక్షలు పలకగా.. ఈ సారి ఏకంగా రూ. 24.60 లక్షలకు పాడటం విశేషం. ఈ వేలం పాటకు మంత్రులు సబితా, తలసాని హాజరు అయ్యారు. మరి బాలాపూర్ లడ్డూ ఇంత ధర పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Revanth: రేవంత్- ఆరోహిల మధ్య మాటల యుద్ధం.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ!