Nellore: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణాలను బలి తీసుకుంది. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండా విద్యుత్ షాక్ తగలటంతో యువకుడు మరణించాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని సీతారామాపురం మండలం ముత్తోలి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండటంతో ఛార్జింగ్ పెట్టాడు. ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే కాల్ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : నిద్రరావడం లేదని యువతి ఊహించని నిర్ణయం.. హాస్టల్ లో అందరూ పడుకున్నాక!