పెళ్లికి ముందు బాగా చూసుకుంటానని మాటిచ్చాడు. వేదమంత్రాల సాక్షిగా అన్నిట్లో జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. కానీ రోజులు గడిచే కొద్ది భర్త తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టి వేధింపులకు పాల్పడ్డాడు. డబ్బుకు ఆశపడి ఊహించని దారుణాలకు తెగబడుతూ భార్యకు నరకాన్ని చూపించారు. భర్త వేధింపులు భరించడం నా వల్ల కాదనుకున్న ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా లక్ష్మివానిపాలెంకు చెందిన రామారావు అనే వ్యక్తితో భారతి నే మహిళకు 2008లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నేళ్ల పాటు భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవించారు. కానీ రోజులు గడిచే కొద్ది భర్త రామారావు తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టాడు. భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేసేవాడు. భర్త వేధింపులను భరించలేని భారతి పుట్టింటికి వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉంది. ఆ తర్వాత భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక నుంచి అలా చేయనని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత భారతి మళ్లి అత్తింట్లో అడుగు పెట్టి భర్తతో సంసారం సాగించింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత అదే వేధింపులు కొనసాగాయి. అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు దిగుతూ భర్త తరుచు నరకాన్ని చూపించేవాడు. ఇక భర్త తీరును భరించలేకపోయిన భారతి.. నా వల్ల కాదనుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే భారతి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న భారతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పెళ్లై రెండేళ్లు అవుతుంది.. కోరుకున్న సుఖం దక్కలేదని!