ఆమె పేరు దళాయి దివ్య. విజయనగరం జిల్లాకు చెందిన ఈ యువతి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అనేకునేది. కానీ ఆమె వెళ్లిన మార్గం మంచిదే అయినా చివిరికి ప్రేమ పేరుతో జాల్సాలకు అలవాటు పడింది. తప్పుదారుల్లో అడుగులేసి చివరికి తన తప్పును తెలుసుకుని చేజేతులా ప్రాణాలు తీసుకుంది. తాజాగా విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? జిల్లాలోని తెర్ల మండలం విజయపురి కాలనీకి చెందిన దళాయి దివ్య (22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్న దివ్య విశాఖ వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంది. ఈ మాట విన్న దివ్య తల్లిదండ్రులు సంతోషపడి సివిల్స్ కోచింగ్ కు డబ్బులిచ్చి పంపించారు. అయితే మొదట్లో దివ్య బాగానే చదువుకునేది. కోచింగ్ తీసుకునే క్రమంలోనే దివ్యకు వెంకటేశ్వరరెడ్డి అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు ఎంచక్కా పార్కులు, సినిమాలు అంటూ తెగ తిరిగారు. ఇదిలా ఉంటే వెంకటేశ్వరరెడ్డి గత ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో అప్పులు చేస్తూ విశాఖలోనే ఉంటున్నాడు. ఇచ్చిన అప్పులు తిరిగివ్వాలంటూ అతనికి ఫోన్ లు చేసేవారు. ఇక వెంకటేశ్వరరెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తన ప్రియురాలైన దివ్యని డబ్బులు అడిగి కొంత డబ్బుతో అప్పులు తీర్చి.., మరి కొంత జల్సాలకు ఖర్చు చేసేవారు. అలా కొంతకాలం పాటు దివ్య ఖర్చుల నిమిత్తం డబ్బులు కావాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకునేది. అలా ఇచ్చిన డబ్బులతో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేవారు. ఇలా ఉన్నత లక్ష్యాన్ని గాలికొదిలేసి జల్సాలు చేసేవారు. అయితే ప్రియుడు వెంకటేశ్వరరెడ్డి పదే పదే డబ్బులు కావాలని దివ్యను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల రూ. లక్ష కావాలంటూ దివ్య తనమేనమామకు ఫోన్ చేసి అడిగింది. అన్ని డబ్బులు ఎందుకంటూ మేనమామ దివ్యను నిలదీశాడు. అలా ప్రశ్నించడంతో దివ్య నోట్లో నీళ్లు నమిలింది. ఇక అనుమానమొచ్చిన మేనమామ సరే.. రేపు విశాఖ వచ్చి ఇస్తానంటూ చెప్పాడు. మేనమామ వస్తే ప్రేమ వ్యవహారంతో పాటు మరిన్ని విషయాలు తెలిసిపోతాయని బయపడింది. ఇక ఏం చేయాలో తెలియక దివ్యకు వెన్నులో వణుకు పుట్టినంత పనైంది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున దివ్య.. కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మల్ని తలదించుకునేలా చేశాను క్షమించడండి అంటూ సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకు పంపింది. వెంటనే అలెర్ట్ అయిన దివ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం రిషికొండ బీచ్ లో ఓ గుర్తు తెలియని యువకుడి డెడ్ బాడీ దర్శనమిచ్చింది. అతని గురించి ఆరా తీయగా దివ్య ప్రియుడేనంటూ తెలిసింది. ఇక వెంకటేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో దివ్య కూడా సూసైడ్ కు పాల్పడి ఉండవచ్చని మొదట్లో పోలీసులు అనుమానించారు. ఈ తరుణంలోనే దివ్య మృతదేహం శుక్రవారం భీమిలి పరిధిలోని తిమ్మపూర్ సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. దివ్య మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగితేలారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేదైన కారణమ ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వంట నూనే అనుకుని పురుగుల మందుతో వంట.. తర్వాత ఏం జరిగిందంటే?