ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు బాధ్యత గల వృత్తిలో ఉంటూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు పోలీసులు స్టేషన్ కు ఫిర్యాదుకు కోసం వచ్చిన మహిళలను వేధిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇద్దరు పోలీసులు బాధ్యత మరిచి బరితెగించి ప్రవర్తించారు. అతిగా మద్యం తాగేసి ఇష్టమొచ్చిన రీతిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడి రోడ్డుపై పోలీసులు కొట్టుకుంటుండగా కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ పోలీసులు ఎందుకు కొట్టుకున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్. ఇదే ప్రాంతంలో ధరమ్ వీర్ సింగ్ కానిస్టేబుల్ గా పని చేస్తుండగా, సునీల్ కుమార్ హోంగార్డుగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల వీరు డ్యూటీలో భాగంగా జగమానపూర్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ డ్యూటీలో ఉంటూనే పోలీసు వాహనాన్ని ఓ చోట నిలిపి మరీ మద్యం సేవించారు. ఫుల్ గా మద్యం సేవించాక ఏదో విషయంలో ఇద్దరి మధ్య ఓ గొడవ రాజుకుంది. దీంతో తాగిన మత్తులో వీళ్లు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాలేదు. నడి రోడ్డుపై ఇద్దరు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. వీరి గొడవను చూసి కొందరు దారిన పోయేవారు నవ్వుకుంటే, మరికొంత మంది పోలీసుల తీరును చూసి అసహ్యించుకున్నారు. అయితే వీరి వ్యవహారం మెల్ల మెల్లగా పై అధికారుల వరకు వెళ్లడంతో స్పందించిన ఎస్పీ ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఇంతటితో ఆగకుండా వీరి ఘటనపై డిపార్ట్ మెంటల్ ఎంక్వరీ కూడా వేయాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం వీరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. తాగిన మత్తులో బాధ్యతను మరిచి బరితెగించి ప్రవర్తించిన పోలీసుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. UP: जालौन में खाकी हुई शर्मसार, नशे में धुत सिपाही ने होमगार्ड पर जमकर बरसाए लात-घूंसे वीडियो वायरल होने के बाद SP रवि कुमार ने किया लाइन हाजिर pic.twitter.com/vPQwNcfFN5 — News24 (@news24tvchannel) September 5, 2022 ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భర్తను కాదని యువకుడితో ప్రేమాయణం, చివరికి!