తమ ప్రేమను గెలిపించుకునేందుకు చాలా మంది కుటుంబ సభ్యులతో పాటు సమాజంపై కూడా పోరాడుతారు. అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుని ఒకటవుతారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల్లో కొందరు హాయిగా జీవిస్తున్నారు. మరికొందరు అయితే చిన్నపాటి మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వారి మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం ఇద్దరిని బలితీసుకుంది. విశాఖపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లాలోని కొత్తకోట గ్రామానికి చెందిన దాసరి ప్రవీణ్ కుమార్(22), అపర్ణ(20)ప్రేమించుకున్నారు. అయితే అపర్ణకు.. ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండే వారు. అపర్ణంటే తనకు ఇష్టమని, వేరే పెళ్లి చేయవద్దని ప్రవీణ్ పెళ్లి సంబంధాలు అడ్డుకునేవాడు. తరచూ ఇలా చేస్తుండటంతో అపర్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రవీణ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ప్రవీణ్, అపర్ణ పారిపోయి విజయవాడలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చి తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పెద్దలతో కలిసే ఉంటూ గ్రామంలోని ఒక పెద్ద వస్త్రదుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదు రోజుల క్రితం వారి మధ్య నెలకొన్న చిన్న వివాదంతో అపర్ణ పురుగు మందు తాగింది. ఆమెను కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త ప్రవీణ్‌కుమార్ మంగళవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని ఆతని కుటుంబీకులు శ్మశానవాటికకు తరలించి అంత్య క్రియలకు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. మృతదేహానికి చితి వద్దే పంచనామా నిర్వహించి, అంబులెన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఈ యువ జంట మరణం ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. అందివచ్చిన పిల్లలు దూరం కావడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. ధైర్యంగా బయటపెట్టారు! కానీ.. ఇదీ చదవండి: టెన్త్ లో కూతురికి 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి! ఎందుకంటే..