సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, వాహనాలను చోరీ చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు దొంగలు వింత చోరీలు చేస్తుంటారు. పశువులను, మొక్కలను దొంగతనం చేయడం ఇలా అనేక వింత దొంగతనాలు మనం చూస్తుంటాం. అలానే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఓ గోదాములో ఉంచిన చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.17 లక్షల విలువైన 150 కాటన్ల చాక్లెట్స్ చోరీకి గురైనట్లు తెలిసింది. అంతటితో ఆగక వారి ఆధారాలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీ పుటేజీని కూడా ఎత్తుకెళ్లారు. గోదాము యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చిన్ హాట్ ప్రాంతంలో రాజేంద్ర సింగ్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఆయనకు దేవ్రాజ్ రాజీ విహార్ ప్రాంతంలో కూడా ఓ ఇళ్లు ఉంది. ఆయన చాక్లెట్స్ సప్లయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో తన ఇంట్లో చాక్లెట్లను స్టాక్ పెట్టుకునే వాడు. అతని దగ్గర చాలా విలువైన చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కొంత కాలం క్రితం వరకు ఫ్యామిలీతో కలిసి ఉండే ఆ వ్యాపారి.. ఇటీవల ఓ కొత్త ఇంట్లోకి మారాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో అతడు చాక్లెట్లు ఉంచిన ఇంటి లోపల తలుపులు తెరిచి ఉండటాని స్థానికులు గమనించారు. వెంటనే సదరు యజమానికి సమాచారం అందించారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిన్ గేట్ మూసే ఉండటాని గమనించాడు. కానీ లోపల తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసే సరికి.. అక్కడ వస్తువులన్నీ చెల్ల చెదురుగా పడి ఉన్నాయి. చాక్లెట్లు చోరీ చేసేందుకు దొంగలు వాహనంతో సహా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. గోడౌన్‌లో ఉంచిన 150 కాటన్ల చాక్లెట్స్‌ను ఆ వాహనం ద్వారా తరలించారు. చోరీకి గురైన చాకెట్ల విలువై సుమారు రూ.17 లక్షల ఉంటుందని యజమాని తెలిపాడు. చాక్లెట్స్ తో పాటు ఇంట్లో ఉంచిన విలువైన వస్తువులు కూడా చోరీకి గురైనట్టు వ్యాపారి రాజేంద్ర సింగ్ సిద్ధూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చుట్టు పక్కల వారిని విచారించారు. ఓ ట్రక్కు రాత్రి చాలా సమయంలో ఆ ఇంటికి సమీపంలో రోడ్డు పక్కన ఉన్నట్లు తెలిసింది. సీసీటీవీ పరిశీలించగా..దొంగలు డీవీఆర్ ను కూడా తొలగించినట్లు తెలిసింది. ఆ ట్రక్కు నెంబర్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వామ్మో.. చేసేది క్లర్క్ ఉద్యోగం.. కానీ ఇంటి నిండా నోట్ల కట్టలే! ఇదీ చదవండి: రూ.500 కోసం తల నరికిన యువకుడు!