ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యులను, అమాయకులను టార్గెట్ గా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ అనేక మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు లక్షల్లో డబ్బులను కాజేస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, సోర్సెస్ నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు రూ.21 లక్షలు పొగొట్టుకుంది. ఈ ఘటన ఏపీ లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని రెడప్ప నాయుడు కాలనీలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి నివాసం ఉంటుంది. అయితే సోమవారం ఆమెకు ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఉన్న లింక్ పై ఆమె క్లిక్ చేసింది. అంతే ఆ తర్వాత క్షణాల్లో ఆమె అకౌంట్ నుంచి డబ్బులు పోయాయి. అనేక సార్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.20 వేలు, రూ.40 వేలు, రూ.80 వేల చొప్పున విత్ డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి. అలా చూస్తూండగానే ఆమె అకౌంట్ లో నుంచి రూ.21 లక్షలను సైబర్ నేరాగాళ్లు కోట్టేశారు. దీంతో షాక్ అయిన సదరు మహిళ వెంటనే బ్యాంకు అధికారును సంప్రదించింది. ఆమె బ్యాంకు అకౌంట్ ని పరిశీలించిన అధికారులు ఫోన్ అయ్యిందని, సైబర్ పోలీసులుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాట్సాప్ లింక్‍పై అనేకసార్లు ఆమె క్లిక్ చేయడం వల్లే, సదరు మహిళ అకౌంట్ లోంచి డబ్బుల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసు తెలిపారు. మదనపల్లి టౌన్ లోనే ఇటీవలే జ్ఞానప్రకాశ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బ్యాంకు ఖాత నుంచి కూడా రూ.12 లక్షలను సైబర్ దొంగలు కోట్టేశారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే తాజాగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజెస్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదీ చదవండి: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్! ఏం చేసిందంటే.. ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన వినాయకుడి విగ్రహాల ధరలు!