ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై అమెరికాలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. న్యూయార్క్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో రష్దీ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. వేదికపై దుండగుడు ఆయనపై దాడి చేశాడు. దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడి దాడిలో సల్మాన్ రష్దీ మెడపై తీవ్రగాయాలు కావడంతో పాటు కాలేయం కత్తిపోట్లతో దెబ్బతింది. అక్కడున్న పోలీసులు, ఇతరులు వెంటనే స్పందించి.. ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దాడి జరిపిన తర్వాత వెంటనే పోలీసులు నింధితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నింధితుడు హదీ మతార్ అని.. అతడిది న్యూయార్క్ అని పోలీసులు తెలిపారు. ఇక సల్మాన్ రష్దీ విషయానికి వస్తే.. భారత్ లో పుట్టి బ్రిటన్ పౌరసత్వం తీసుకుని అమెరికా లో నివసిస్తున్నారు. ఆయన ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ నవలకు మంచి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చింది. అంతేకాదు ఈ నవలకు ‘బుకర్ ప్రైస్’ కూడా వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ రష్దీ ఎలాంటి ప్రాణాపాయం లేదని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ స్పష్టం చేశారు. ఇది చదవండి: వీడియో: నడి రోడ్డుపై వ్యక్తిపై దారుణం.. అందరూ చూస్తుండగానే.. ఇది చదవండి: ప్రేమ పెళ్లై మూడు నెలలు.. ఇంతలోనే ఘోరం!