బాలికలు, ఆడవారిపై జరుగుతున్న నేరాల కట్టడికి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రతి నిమిషం దేశంలో ఏదో ఓ చోట ఎక్కడో ఒకరు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, ఆఖరికి వృద్ధులను కూడా వదలడం లేదు మృగాళ్లు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో దారుణానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక నోట్లో, ముఖంపై యాసిడ్ పోశాడు. అంతటితో ఆగక.. బాలిక గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండటంలోని చెముడుగుంట నక్కలకాలనీలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు స్థానికంగా ఉండే ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పని మీద బటటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది. ఇది గుర్తించిన బాలిక మేనమామ నాగరాజు.. బాధితురాలి ఇంట్లో ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దాంతో బాలిక పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి.. తలుపులు వేసుకునేందుకు యత్నించగా.. ఆమెను వెంబడిస్తూ అక్కడికి వచ్చిన నాగరాజు.. తలుపులు తోసుకుని.. లోనికి వెళ్లాడు. బాత్రూంలో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆమె ముఖం మీద, నోటిలో యాసిడ్ పోశాడు. ఆ బాధ తాళలేక బాధితురాలు కేకలు వేసింది. దాంతో నాగరాజు ఆమె గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి వచ్చి చూడగా.. అప్పటికే బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు, బాలిక మేనమామ నాగరాజు కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో బాలిక అతడితో మాట్లాడడంలేదు. అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో బాలికపై కోపం పెంచుకున్న నాగరాజు.. అదునుకోసం వేచి చూశాడు. చివరకు తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ప్రవేశించి బాలికపై అత్యాచారం చేయబోయాడు. బాధితురాలు అడ్డుకునేసరికి హతమార్చాలనుకున్నాడు. దానిలో భాగంగానే యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. గొంతు కోసి ప్రాణాలు సైతం తీయాలని చూశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు దారుణం! కిడ్నాప్ చేసి మరి.. ఇది కూడా చదవండి: 40 నిమిషాల నరక వేదన.. కాపాడాలని వేడుకుంటూనే..