నల్గొండ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతిపై కతితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లాకు చెందిన రోహిత్(21) అనే యువకుడు ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదవుతున్నాడు. ఈ క్రమంలో నవ్య అనే అమ్మాయి వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇలా.. ఏడు నెలల నుంచి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అమ్మాయి.. ప్రేమ వ్యహారాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఈ క్రమంలో నవ్య.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నవ్య తన ఫ్రెండ్ తో కలిసి స్థానికంగా ఉన్న ఫారెస్ట్ పార్కుకు వచ్చింది. ఆ పార్కులో సాయి అనే ఫ్రెండ్‌తో నవ్య, శ్రేష్ఠ మాట్లాడుతుండగా.. రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి.. పార్కులోనే మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. కాసేపట్లో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తన బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో అమ్మాయికి ఎనిమిది చోట్ల కత్తి గాయాలయ్యాయి. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.