ఆమె పేరు మట్ట అనూష. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు కన్నీటి శోకాన్ని మిగిల్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వింజమూరు గ్రామానికి చెందిన అనూష మాల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే బుధవారం ఏం జరిగిందో ఏం తెలియదు కానీ అనూష ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ యువతి మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: చాక్లెట్ల ఆశ చూపించి ఆరేళ్ళ చిన్నారిపై కమెడియన్ అత్యాచారం!