నేటి తరం అమ్మాయిలు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువులో విఫలమవుతున్నానని.. ఇలా కారణాలు వేరైన చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే చావుకు ఎదురెళ్లిన ఓ యువతి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. తాజాగా ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ముంబై నగరంలోని బైకుల్లా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కొందరు తాము ఎక్కే ట్రైన్ కొందరు ఎదురు చూస్తుంటే, మరికొందరు టికెట్ కౌంటర్ ఎక్కడా అంటూ పరుగులు పెడుతున్నారు. ఇలా వారి గమ్యాలను చేరుందుకు తమ ప్రయాత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొస్తున్న రైలు కూత శబ్దాలు ప్రయాణికుల చెవును తాకుతున్నాయి.. ఇక రైలు రాకను గమనించిన ప్రయాణికులు ప్లాట్ ఫామ్ లో రెడీగా ఉన్నారు. అంతలోనే ఓ యువతి పట్టాల మీద నుంచి వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్తోంది. ఈ సీన్ ను చూసిన అక్కడి ప్రయాణికులు అంతా పక్కకు జరగాలంటూ గొంతులు పగిలేలా అరుస్తున్నారు. వారి మాటలను లెక్కచేయని ఆ యువతి అడుగులు ఇంకాస్త వేగంగా ముందుకు వేస్తూ రైలుకు ఎదురుగా వెళ్తోంది. వెంటనే స్పందించిన ట్రైన్ డ్రైవర్ ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కొందరు స్టేషన్ పోలీసు అధికారులు ఆ యువతిని రక్షించారు. ఆ యువతి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీన్ అంతా స్ఠానిక రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం పోలీసులు ఆ యువతిని స్టేషన్ కు తరలించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. A woman attempted suicide in front of local train #Mumbai @Central_Railway RPF saved her pic.twitter.com/essLR9hf7c — Arjun Dhfc (@ArjunMahiDhfc) August 28, 2022 ఇది కూడా చదవండి: శోభనం రాత్రే కోలుకోలేని ఝలక్ ఇచ్చిన భర్త.. వధువు అరుపులు విని!