మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ దుర్మార్గుడు మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని పాథార్డీ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో జుబేదా అనే మహిళ పని చేస్తుంది. ఇటీవల ఆ మహిళ పని చేస్తున్న పెట్రోల్ బంకు చేరుకున్న ప్రమోద్ గోసావి అనే వ్యక్తి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ మహిళను వెంటాడి మరీ దాడి చేశాడు. ఇక పక్కనున్న వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసేసరికి ప్రమోద్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జుబేదా, ప్రమోద్ గోసావి గతంలో ప్రేమించుకుని కొన్నిరోజుల తర్వాత విడిపోయారు. ఈ కారణంతోనే ఆ దుర్మార్గుడు ఆ మహిళపై పగ తీర్చుకునేందుకు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అక్షిత హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు!