Khammam: ఖమ్మం జిల్లా సుర్దేపల్లి ఏటి ఘటనకు సంబంధించి నీటిలో గల్లంతైన రెండు మృతదేహాలను వెలికితీశారు. గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా.. శుక్రవారం డీఆర్‌ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్, రంజిత్ మృతదేహాలను కనుగొన్నారు. అనంతరం ప్రదీప్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించే నేపథ్యంలో వివాదం నెలకొంది. ప్రదీప్ కుటుంబసభ్యులు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించడానికి ఒప్పుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రదీప్ చనిపోయాడంటూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కన్నీళ్లు తెప్పించే ఓ ఘటన జరిగింది. రాఖీ పండుగ కోసం బి.ప్రదీప్‌కు రాఖీ కట్టేందుకు అతడి అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్‌కు రావటానికి సిద్ధమైంది. అంతలోనే ప్రదీప్ ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. అయినా, ఆమె మాత్రం తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం కూడా అక్కడే ఉండి తమ్ముడి ప్రాణాలతో వస్తాడని వెయ్యికళ్లతో వేచిచూస్తోంది. ఇంతలోనే ప్రదీప్ మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి గుండె పగిలిపోయింది. తమ్ముడి మృతదేహాం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘‘తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా!!’’ అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. ఈ ఘటన అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. కాగా, గురువారం రంజిత్ అనే వ్యక్తి సుర్దేపల్లి ఏటిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నీటిలో మునిగిపోయాడు. రంజిత్‌ను కాపాడ్డానికి ఖమ్మం కార్పొరేషన్ డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్‌లు నీటిలో దూకారు. రంజిత్‌తో పాటు వారు కూడా గల్లంతయ్యారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : తప్పతాగి స్కూల్ కు వచ్చిన హెడ్ మాస్టార్.. విద్యార్థుల ముందే.. ఛీ..ఛీ..!