ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం కొత్త కొత్త పద్దతుల్లో దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేస్తూ.. అవసరమైన చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీరాజ్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తనయుడు పృథ్వీతేజ ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకొని కారులో బయలుదేరుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి టోలిచౌకి వద్ద పృథ్వీ తేజ కారుకు బైక్‌ను అడ్డం పెట్టి ఆపారు. ఆయన్ని బెదిరించి ఒక వ్యక్తి కారులోకి బలవంతంగా ఎక్కారు. డ్రైవింగ్ సీటులో ఉన్న పృథ్వీ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు కారు పోనీయాలని చెప్పారు. ఆ తర్వాత ఆయనపై దాడి చేసి బెదిరించి రూ.75వేల నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన జరిగిన తర్వాత పృథ్వీతేజ తన వ్యక్తిగత సిబ్బందికి విషయం తెలిపారు. వారు వెంటనే పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: చికోటి ప్రవీణ్ ఫాం హౌస్‌లో మినీ జూ.. అటవీ అధికారులు ఏమన్నారంటే.. ఇది చదవండి: వీడియో: తల్లి మృతదేహంతో.. బైక్‌పై 80 కి.మీ ప్రయాణం!