కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరి మహిళపై కన్నేసిన కొందరు దుర్మార్గులు ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్తలేని ఒంటరి మహిళపై ఆ దుర్మార్గులు ఏం చేశారు? దారుణానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అయ్యనగారి వాణి(40) అనే మహిళ నివాసం ఉంటుంది. మూడేళ్ల కిందట వాణి భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన కూతురు సంధ్యతో పాటు ఉంటుంది. అయితే గత కొన్నిరోజుల కిందట వాణి తన కూతురికి పెళ్లి చేయడంతో అప్పటి నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉంటుంది. అప్పటి వరకు ఆమె జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని సంచిలో వేసి కాల్చేశారు. ఆ దండగులు సగం కాలిన శవాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఏదో కాలుతున్న వాసన రావడంతో స్థానికులు ఏంటని గమనించడంతో కాలుతున్నది మనిషి శవం అని తెలుసుకున్నారు. దీనిని కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అసలు ఈ మహిళను ఎవరు హత్య చేశారు? వివాహేతర సంబంధాల కారణంగానే ఆమెను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భర్తను కాదని ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమాయణం! చివరికి ట్విస్ట్!