తప్పు చేసి జైల్లో శిక్ష అనుభిస్తున్న ఖైదీలే మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా వారికి రక్షణగా ఉన్న మహిళా పోలీసుపై కొందరు ఖైదీలు బెరితెగించి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇటీవల ఇజ్రాయేల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? ఇజ్రాయేల్ జెరుసలేంలోని ఓ జైలులో కొందరు ఖైదీలు గత కొన్ని రోజుల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్ష అనుభవిస్తున్న కొందరు కరుడుగట్టిన నేరస్తులు వారికి రక్షణగా ఉన్న మహిళా పోలీసుపైనే కన్నేశారు. ఇంతటితో ఆగాక ఆమెపై అత్యాచారం చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆ ఖైదీల దారుణాన్ని తట్టుకోలేక పోయిన ఆ మహిళా పోలీసు అధికారి ఎలాగో బయటకు వచ్చి తనపై జరిగిన దారుణంపై పెదవి విప్పింది. పలుకుడి ఉన్న కొందరు ఖైదీలు అధికారుల అండతో నన్ను లైంగిక చర్య కోసం బానిసగా వాడుకున్నారని వాపోయింది. ఆ ఖైదీలు పలుమార్లు నాపై అత్యాచారం చేశారని తెలిపింది. ఇక నన్ను బయటకు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని బాధిత మహిళ పోలీసు వాపోయింది. తాజాగా ఇజ్రాయేల్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మహిళా పోలీసు అధికారిపై ఖైదీలు అత్యాచారం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది అమ్మా..!