ఈ మద్య నగరంలో నేరాల సంఖ్య బాగానే పెరిగిపోతుంది. మాదాపూర్ లో గన్ తో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా కాల్చిన చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరువక ముందే.. తాజాగా సికింద్రాబాద్ లో నడిరోడ్డుపై ఓ ఎస్ ఐ ని దుండగులు కత్తితో పొడిచి పారిపోయారు. వివరాల్లోకి వెళితే.. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి సమయంలో ఎస్‌ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్ఐ వినయ్ వారిని ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నారు.. బండి కాగితాలు ఏవి అంటూ ప్రశ్నిస్తున్న సమయంలోనే బైక్ పై ఉన్న ఓ వ్యక్తి కత్తి తో ఎస్ఐని పొడిచి అక్కడ నుంచి పారిపోయారు. గాయపడ్డ ఎస్ఐ ని వెంటనే సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే నింధితులు యాప్రాల్ కు చెందిన పవన్, సంజయ్ గా పోలీసులు గుర్తించారు.. కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: డేంజరస్ చెడ్డీ గ్యాంగ్.. వెన్నులో వణుకు పుట్టేలా!